Foni: చాలా రోజుల తరువాత నేడు సచివాలయానికి చంద్రబాబు!

  • తుపానుపై సమీక్షించనున్న సీఎం
  • ఎన్నికల షెడ్యూల్ తరువాత సచివాలయానికి దూరంగా బాబు
  • ఫణి ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు

చాలా రోజుల తరువాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, నేడు సచివాలయానికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తరువాత, ఆయన సచివాలయానికి రాలేదు. దాదాపు నెలన్నర పాటు ఎన్నికల ప్రచారంలోనే బిజీగా ఉండిపోయిన ఆయన, ఎన్నికల తరువాత కొన్ని రోజులు సేదదీరేందుకు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించి వచ్చారు.

ఆపై తనకు మిత్రులైన రాజకీయ నేతలకు అనుకూలంగా ప్రచారం నిర్వహించేందుకు పలు రాష్ట్రాలకు వెళ్లారు. ఉండవల్లి ప్రజా వేదిక నుంచే కొన్ని సమీక్షలు చేశారు. కానీ, నేడు ఫణి తుపాను చూపనున్న ప్రభావం, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చేందుకు ఆయన సచివాలయానికి వచ్చి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న అధికారులు హాజరవుతారని తెలుస్తోంది.

Foni
Chandrababu
Secreteriate
  • Loading...

More Telugu News