Maharshi: 'మహర్షి' మరో రికార్డు... యూట్యూబ్ ట్రెండింగ్ నంబర్ వన్!

  • నిన్న విడుదలైన ట్రయిలర్
  • 9న విడుదల కానున్న చిత్రం
  • ఇప్పటికే రెండున్నర మిలియన్ల వ్యూస్

మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొంది, మరో వారంలో విడుదల కానున్న 'మహర్షి' చిత్రం థియేటరికల్ ట్రయిలర్ ను నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విడుదల చేశారు. ఈ ట్రయిలర్ కు విశేషమైన స్పందన వచ్చింది.
నిన్న రాత్రి 9 గంటల వ్యవధిలో ఇది విడుదల కాగా, ఇప్పటివరకూ దాదాపు రెండున్నర మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానంలో 'మహర్షి' ట్రయిలర్ ఉంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

Maharshi
Mahesh Babu
Trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News