Masood Azhar: ఇస్లామాబాద్‌లో సేఫ్‌గా మసూద్ అజర్.. భారత ప్రభుత్వానికి తెలిపిన నిఘా వర్గాలు
- మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస
- ఇస్లామాబాద్‌లోని ఓ సురక్షిత భవనంలో ఉన్న మసూద్
- దాచి పెట్టిన ఐఎస్ఐ
అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఇస్లామాబాద్‌లో అత్యంత భద్రత కలిగిన ఓ రహస్య భవనంలో దాక్కున్నట్టు భారత నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందించిన నివేదికలో తెలిపాయి. బహవాల్పూర్ పట్టణంలోని మర్కజ్ సుభాన్ అల్లా గృహ నిర్బంధంలో ఉన్న మసూద్‌ను బాలాకోట్ దాడుల తర్వాత ఇస్లామాబాద్‌లోని రహస్య ప్రాంతంలోని సురక్షిత భవనంలోకి తరలించినట్టు ఆ పత్రాల్లో పేర్కొన్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధికారులే అతడిని దాచి పెట్టారని భారత నిఘా వర్గాలు తెలిపాయి.
మసూద్ అజర్ భారత్‌పై ఎలా విషం చిమ్ముతున్నదీ అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి చూసిందని పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు కశ్మీర్ లోయలో జిహాదీ కార్యకలాపాలను మసూద్ ఎలా విస్తరిస్తున్నదీ ఆ నివేదిక పత్రాల్లో పేర్కొన్నాయి. జైషే మహ్మద్ కార్యకలాపాలను విస్తరించే బాధ్యతను తన సోదరుడు, ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ కు మసూద్ అప్పగించాడని సమాచారం.