Aishwarya Rai: ఇప్పటికైనా బిడ్డ చెయ్యి వదలవమ్మా.. వదులు!: ఐశ్వర్యారాయ్ ని తిట్టిపోస్తున్న నెటిజన్లు!

  • డిన్నర్ పార్టీకి వెళ్లిన సెలబ్రిటీ కపుల్
  • తన బిడ్డ చేతిని వదలని ఐశ్వర్య
  • ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియాలోని ఓ వర్గం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, తన బిడ్డ ఆరాధ్యను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఆ జాగ్రత్తే మరింత అతి జాగ్రత్తగా మారడంతో... సోషల్ మీడియాలోని ఓ వర్గం ఇప్పుడు ఐశ్వర్యారాయ్ ని తిట్టిపోస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే, రెండు రోజుల క్రితం ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య, జయా బచ్చన్ లు బీకేసీలోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేశారు. ఆపై వారు బయటకు వస్తుంటే, కెమెరాలు క్లిక్ మన్నాయి. అంతవరకూ బాగానే ఉంది. ఆ ఫోటోలు బయటకు వచ్చిన తరువాత, ఐష్, తన కుమార్తె చేతిని పట్టుకున్న విధానాన్ని చూసి, నెటిజన్లు పలు నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.

 "దయచేసి ఆరాధ్య చేయి వదులుతావా ఐశ్వర్యా" అని ఒకరు, "ఎప్పుడూ ఇలానే పట్టుకుంటే ఆమె కుమార్తెకు భుజం నొప్పి వస్తుంది" అని ఇంకొకరు కామెంట్ చేశారు. అంతే కాదు, "దయచేసి ఆరాధ్యను వదులు. ఆమెను నాలుగడుగులన్నా స్వేచ్ఛగా వేయనీ" అని, "ఆరాధ్య ఏమీ మూడేళ్ల బిడ్డ కాదు చెయ్యి పట్టి నడిపించడానికి" అని... ఇలా ఐశ్వర్యను ట్రోల్ చేస్తూ కామెంట్లు వస్తున్నాయి.

Aishwarya Rai
Aradhya
Abhisheik
Dinner
Social Media
Trool
  • Loading...

More Telugu News