zakir naik: జకీర్ నాయక్ పీస్ టీవీపై శ్రీలంక వేటు.. ప్రసారాల నిలిపివేత

  • పేలుళ్ల తర్వాత పీస్ టీవీపై నిషేధాజ్ఞలు
  • ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్‌లలో నిషేధం
  • రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నారని ఆరోపణ

ఐసిస్ భావజాల కార్యక్రమాలను ప్రసారం చేస్తోందంటూ ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ పీస్ టీవీపై శ్రీలంక ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కార్యక్రమాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోందంటూ చానల్‌ను నిషేధించింది. ఈస్టర్ సండే పేలుళ్ల తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో కేబుల్ ఆపరేటర్లు టీవీ ప్రసారాలను నిలిపివేశారు. కాగా, భారత్, బంగ్లాదేశ్‌లలో ఇప్పటికే పీస్ టీవీపై నిషేధం ఉంది.

ముంబైకి చెందిన  ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌-జకీర్ నాయక్ సంయుక్తంగా 2006లో పీస్ టీవీని స్థాపించారు. 2009లో ఉర్దూ, 2011లో బంగ్లా వెర్షన్‌ను కూడా ప్రారంభించారు. దుబాయ్ కేంద్రంగా ప్రసారాలు జరుగుతున్న పీస్ టీవీలో తన బోధనల ద్వారా జకీర్ నాయక్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఉగ్రవాదులతో సంబంధాలు, మనీలాండరింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. 2016లో భారత్‌ను విడిచి వెళ్లిన జకీర్ ప్రస్తుతం మలేషియాలో ఉన్నట్టు తెలుస్తోంది.

zakir naik
peace tv
Sri Lanka
India
Bangladesh
ban
  • Loading...

More Telugu News