Vallabhaneni Vamsi: నాకు సన్మానం చేస్తానని బెదిరిస్తున్నాడు.. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత యార్లగడ్డ ఫిర్యాదు

  • నేను లేనప్పుడు మా ఇంటికొచ్చారు
  • నాకు ప్రాణహాని ఉంది
  • రక్షణ కల్పించండి

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, వెంటనే తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి వెళ్లారని పేర్కొన్న ఆయన అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఉందని తెలిపారు. తనకు ‘సన్మానం’ చేసేందుకు ఇంటికి వస్తానని వంశీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. వారం రోజులుగా ఆయన బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్న యార్లగడ్డ తనకు వెంటనే గన్‌మెన్‌ను కేటాయించాలని కోరారు.

Vallabhaneni Vamsi
yarlagadd venkatrao
Vijayawada
  • Loading...

More Telugu News