SPY Reddy: నేడు నంద్యాలలో ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు.. వివిధ పార్టీల నేతల నివాళులు

  • మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో మృతి
  • స్వగ్రామంలో నేడు అంత్యక్రియలు
  • పలువురు నేతల నివాళి

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు నేడు నంద్యాలలో జరగనున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామమైన బొమ్మలసత్రం తరలించారు. పలు పార్టీల నేతలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నేడు ఎస్పీవై భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎస్పీవైకి నివాళులు అర్పించిన వారిలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఇంతియాజ్‌ అహ్మద్, జనసేన నాయకులు, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు, అధికారులు ఉన్నారు.

SPY Reddy
Kurnool District
Nandyal
  • Loading...

More Telugu News