Navajyoth Singh Siddu: సిద్ధూపై ఎన్నికల సంఘం సీరియస్.. రేపు సాయంత్రం 6 లోపు వివరణ ఇవ్వాలని నోటీస్

  • మోదీ ఒక అబద్ధాల కోరు
  • చౌకీదార్ దొంగలను తయారు చేస్తున్నారు
  • మహాత్ముని గడ్డపై మోదీ కనపడటం దురదృష్టకరమన్న సిద్ధూ

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. గత నెల 17న అహ్మదాబాద్‌లో జరిగిన ర్యాలీలో భాగంగా సిద్ధూ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని అబద్ధాల కోరుగా అభివర్ణించారు. చైనా సముద్రం కింద రైల్వే లైన్‌ను నిర్మిస్తుంటే, మోదీ చౌకీదార్ దొంగలను తయారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మహాత్ముడు నడయాడిన గడ్డపై అతిపెద్ద అబద్ధాల కోరైన మోదీ కనబడుతుండటం దురదృష్టకరమని సిద్ధూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత నీరజ్, ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధూ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నేడు ఈసీ నోటీసు జారీ చేసింది. రేపు సాయంత్రం 6 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Navajyoth Singh Siddu
Election Commission
Narendra Modi
Neeraj
Chaina
  • Loading...

More Telugu News