Lalitha Jewellery: లలితా జ్యువెలరీ దుకాణాల్లో ఏకకాలంలో అధికారుల తనిఖీలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0eb88b17aae8b1a1de375ffa431f8d16a55a29ed.jpg)
- సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు
- పరీక్షల కోసం కొంత బంగారం స్వాధీనం
- పలు అంశాలపై ఆరా తీసిన అధికారులు
ఏపీలో పలు ప్రాంతాల్లో ఉన్న లలితా జ్యువెలరీ షోరూంల్లో ఏకకాలంలో తూనికలు, కొలతల అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రిలోని లలితా జ్యువెలరీ షోరూంల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెబుతున్నారు. షోరూమ్‌ల్లోని కొంత బంగారాన్ని పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నారు. తూనికలు, కొలతల శాఖ కమిషనర్ దామోదర్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీలలో బంగారం తూకం, నాణ్యత, ప్రైజ్‌మనీ చిట్స్ పలు అంశాలపై అధికారులు ఆరా తీశారు.