High Court: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు వేసవి సెలవులు

  • ఎండలు మండుతుండడంతో సెలవులు
  • మే 2 నుంచి 31 వరకు సెలవులు
  • నోటిఫికేషన్ జారీచేసిన రిజిస్ట్రార్ జనరల్

ఎండలు మండుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈనెల 2వ తేదీ నుంచి నెలాఖరు వరకు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు సెలవులకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  

మరోవైపు తెలంగాణ హైకోర్టుకు కూడా మే 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అయితే, అత్యవసర కేసుల విచారణ కోసం ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లో హైకోర్టు ప్రత్యేక విభాగం పనిచేయనుంది.

  • Loading...

More Telugu News