Yadadri Bhuvanagiri District: సైకో శ్రీనివాసరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-9ef2ff11a2e53a7eb36f9c1250ca608aac093ace.jpg)
- సంచలనం రేపిన వరుస హత్యలు
- హత్యలు చేసినట్టు అంగీకరించిన శ్రీనివాసరెడ్డి
- వరంగల్ జైలుకు తరలింపు
యాదాద్రి జిల్లాలో వెలుగు చూసిన మూడు హత్యలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ మూడు హత్యలూ తానే చేసినట్టు పోలీసుల విచారణలో సైకో శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. నేడు అతడిని పోలీసులు భువనగిరి కోర్టులో హాజరు పరిచారు. సైకో శ్రీనివాసరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భువనగిరి ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం శ్రీనివాసరెడ్డిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.