Harinath: సికింద్రాబాద్ లో భార్యాభర్తల ఆత్మహత్య

  • ఇటీవల ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన హరినాథ్
  • అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సునీత
  • పిల్లలు లేకపోవడమే కారణమని భావిస్తున్న బంధువులు

అనారోగ్య కారణాల రీత్యా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న హరినాథ్, సునీత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహించిన హరినాథ్ ఇటీవల సస్పెండ్ అయ్యారు. మరోవైపు ఆయన భార్య సునీత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు అభిప్రాయపడుతున్నారు. అయితే తమ చావుకు అనారోగ్య సమస్యలే కారణమని హరినాథ్ దంపతులు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Harinath
Sunitha
Conductor
Suspend
Suicide
Gandhi Hospital
  • Loading...

More Telugu News