Sindhu Sharma: పెద్ద కుమార్తె కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సింధు శర్మ

  • చిన్న కుమార్తెను సింధుకు అప్పగింత
  • పెద్ద కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టుకు సింధు
  • లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు కోడలు సింధు శర్మ తన పెద్ద కుమార్తె రిషిత కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆమెకు తన చిన్న కుమార్తెను మాత్రం అప్పగించిన రామ్మోహనరావు కుటుంబ సభ్యులు పెద్ద కుమార్తెను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. దీంతో తన పెద్ద కుమార్తె ఆచూకీ తెలపాలంటూ సింధు శర్మ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

నేడు ఆమె దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా రిషికతో పాటు ఆమె తల్లిదండ్రులు సింధుశర్మ, వశిష్టలను కోర్టు ఎదుట హాజరు పరచాలని హైదరాబాద్ మధ్య మండలం డీసీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Sindhu Sharma
Rammohan Rao
Rishitha
Vasista
High Court
  • Loading...

More Telugu News