Tollywood: అనాథ పిల్లలతో కలిసి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-38a618ad50e3ad5e8d8b0f04be08473b4893233a.jpg)
- హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో చూసిన నటుడు
- పిల్లలంతా సినిమాను ఎంజాయ్ చేశారని వ్యాఖ్య
- వారందరికీ తలో మొక్కను అందజేస్తున్నామని వెల్లడి
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈరోజు ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా చూశారు. కొంతమంది అనాథ పిల్లలతో పాటు తన స్నేహితుడు నవీన్, సోదరుడు వైష్ణవ్ తో కలిసి హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలంతా సినిమాను బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు.
ఈ విషయంలో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ఈ పిల్లలకు సామాజిక బాధ్యత తెలియజేయాలన్న ఉద్దేశంతో వాళ్లందరికి చిన్నచిన్న మొక్కలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ పిల్లలు సినిమా చూసేందుకు సహకరించిన మేనేజ్ మెంట్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.