spy reddy: పారిశ్రామికవేత్తగా ఎస్పీవై రెడ్డి ప్రత్యేకతను చాటుకున్నారు.. ఆయన మరణం సీమకు తీరని లోటు!: నాదెండ్ల మనోహర్

  • ఎస్పీవై రెడ్డి మరణంపై దిగ్భ్రాంతి
  • ఆయన అనుభవం ఉపయోగపడుతుందని ఆశించాం
  • కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

జనసేన నంద్యాల లోక్ సభ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి మృతిపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ పారిశ్రామికవేత్తగా ఎస్పీవై రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారని మనోహర్ తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం పాటించిన వ్యక్తిగా అందరి మన్ననలు అందుకున్నారని కితాబిచ్చారు.

ఎస్పీవై రెడ్డి అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశించామన్నారు. కానీ ఎస్పీవై రెడ్డి ఆకస్మికంగా అందరినీ వదిలి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి మరణం ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

spy reddy
Jana Sena
nadendla manohar
  • Loading...

More Telugu News