Kanna: మోదీ ఒక మాట అంటేనే ప్రజాస్వామ్యానికి భంగం కలిగిందా? మీరు ఎన్ని వెధవ వేషాలు వేశారో మర్చిపోయారా?: చంద్రబాబుపై కన్నా ఫైర్

  • 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి తీసుకురాలేదా?
  • ఎన్టీఆర్ మద్దతుదారులను దాచినప్పుడు ఏమైంది
  • ప్రజాస్వామ్యం?కుమారస్వామి కోసం 110 మందిని హైదరాబాద్ లో దాచింది ఎవరు?

ప్రధాని నరేంద్ర మోదీ శరంపూర్ సభలో మాట్లాడుతూ 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. అయితే, బాబు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అదేస్థాయిలో స్పందించారు. మోదీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశారని, కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చంద్రబాబు ఎన్ని వెధవ వేషాలు వేశారో అందరికీ తెలుసని మండిపడ్డారు.

"పశ్చిమబెంగాల్ లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నారని మోదీ గారు అంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? ఆనాడు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్ లో దాచిపెట్టినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? కర్ణాటకలో సంకీర్ణం వస్తే కుమారస్వామికి దన్నుగా 110 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తీసుకువచ్చి దాచిపెట్టలేదా? అప్పుడు ప్రజాస్వామ్యానికి భంగం కలగలేదా?" అంటూ కన్నా నిలదీసి అడిగారు.

  • Loading...

More Telugu News