Tollywood: అందుకే జనసేన, వైసీపీ, టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాను!: హీరో నిఖిల్

  • వీరంతా మంచి వ్యక్తులు
  • వీరిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది
  • నేను రాజకీయాల్లోకి రావట్లేదు
  • మీడియాతో టాలీవుడ్ హీరో

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా తాను చాలామంది నేతల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించానని సినీనటుడు నిఖిల్ తెలిపాడు. తనకు రాజకీయ పార్టీలు ప్రధానం కాదనీ, మంచి వ్యక్తులు ముఖ్యమని వ్యాఖ్యానించాడు. తనను గెలిపిస్తే ఈ హామీలు అమలు చేస్తానంటూ జనసేన విశాఖ లోక్ సభ సీటు అభ్యర్థి, వీవీ లక్ష్మీనారాయణ అఫిడవిట్ ఇచ్చారని నిఖిల్ చెప్పాడు. ఈ పని తన మనసుకు ఎంతగానో హత్తుకుందనీ, అందుకే ఆయనకు మద్దతు తెలిపానన్నాడు. హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడాడు.

అలాగే వైసీపీ తరఫున పెందుర్తిలో పోటీ చేస్తున్న అన్నంరెడ్డి అదీప్ రాజు మంచి వ్యక్తి అనీ, అందుకే ఆయన తరఫున ప్రచారంలో పాల్గొన్నానని చెప్పుకొచ్చాడు. సికింద్రాబాద్ లోక్ సభ సీటు నుంచి పోటీచేస్తున్న టీఆర్ఎస్ నేత తలసాని సాయి యాదవ్ కు కూడా తాను మద్దతు ఇచ్చానన్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాననీ, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని నిఖిల్ స్పష్టం చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News