ajay bhupathi: 'మహా సముద్రం'పై స్పందించిన దర్శకుడు అజయ్ భూపతి

  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్ 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
  •  'మహా సముద్రం'పై స్పందించిన దర్శకుడు

 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా సాధించిన విజయం .. రాబట్టిన వసూళ్లు ఇండస్ట్రీలో అంతా ఆయన వైపు చూసేలా చేశాయి. ఆయన తదుపరి సినిమాగా 'మహా సముద్రం' రూపొందనుందనీ .. ఇది యాక్షన్ తో కూడిన ప్రేమకథాంశమనే టాక్ వచ్చింది.

ఈ సినిమాలో చైతూ కథానాయకుడిగా నటించనున్నాడనీ, కథానాయికగా సమంతను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. విశాఖ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని చెప్పుకున్నారు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమా చేయాలో నాకు తెలుసు. దయచేసి పుకార్లకు చెక్ పెట్టండి' అంటూ కోరాడు. అసలు ప్రాజెక్టే లేదా? పైన పేర్కొన్న నటీనటులతో లేదా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. 

ajay bhupathi
  • Loading...

More Telugu News