Andhra Pradesh: సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీ, వేదికపై స్పష్టత ఇచ్చిన టీడీపీ వర్గాలు!

  • విజయంపై ధీమాగా ఉన్న టీడీపీ
  • ఈ నెల 25న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం
  • ఎన్టీఆర్ జయంతి రోజునే మహానాడు నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం విజయోత్సవానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి ధీమాతో ఉన్న టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని నేతలు పరిశీలిస్తున్నారు.

అలాగే ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహానాడును ఒకే రోజుకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఫలితాలు వచ్చిన రెండ్రోజులకు అంటే.. ఈ నెల 25న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28న ఒక్కరోజు మాత్రమే ఈసారి మహానాడును నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
MAHANADU
oath taking cermony
  • Loading...

More Telugu News