pubji: పబ్ జీ ఆడొద్దని చెప్పిన భర్త.. విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లిన భార్య!

  • యూఏఈలో విచిత్రమైన ఘటన
  • తన హక్కులను కాలరాస్తున్నాడని భర్తపై ఆగ్రహం
  • భార్య ఫిర్యాదుపై లబోదిబోమన్న భర్త

సాధారణంగా భర్త తనను పట్టించుకోవడం లేదనో, వేధిస్తున్నాడనో విడాకులు కోరిన మహిళలను ఇప్పటివరకూ చూసి ఉంటాం. కానీ తాజాగా భర్త ‘పబ్ జీ’ గేమ్ ఆడవద్దని చెప్పినందుకు ఓ యువతి కోర్టు మెట్లు ఎక్కింది. తన హక్కులను హరిస్తున్న భర్త నుంచి విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని డిమాండ్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

యూఏఈలోని ఓ యువతి(20)కి ఇటీవల వివాహమయింది. అయితే పెళ్లయిన దగ్గరి నుంచి ఆమె ఫోన్ లో పబ్ జీని విపరీతంగా ఆడటాన్ని గమనించిన భర్త.. దాన్ని మానుకోవాలని సూచించాడు. దీంతో ఒక్కసారిగా సదరు యువతి అగ్గిమీద గుగ్గిలమయింది. ‘నాకు విడాకులు కావాల్సిందే’ అని కోపంతో బుసలుకొట్టింది. ఈ విషయమై పోలీసులు ఏమయిందని ప్రశ్నించగా, తనకు కావాల్సిన వినోదాన్ని ఎంచుకునే హక్కును తన భర్త కాలరాస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

పబ్ జీ గేమ్ ను తాను కేవలం స్నేహితులు, బంధువులతోనే ఆడతానని స్పష్టం చేసింది. అయితే ఆమెను బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదనీ, కేవలం పబ్ జీకి బానిస కాకూడదన్న ఉద్దేశంతోనే దూరంగా ఉండాలని కోరానని భర్త వాపోయాడు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు త్వరలోనే విచారణ జరిపి తీర్పును వెలువరించనుంది.

pubji
wife
request
husband
uae
UAE
  • Loading...

More Telugu News