Delhi Women: అమ్మాయిల పొట్టి దుస్తులు అందుకేనట... వదిలిపెట్టవద్దని ఢిల్లీ మహిళ సలహా... వైరల్ అవుతున్న వీడియో!

  • షార్ట్స్ వేసుకుని కనిపిస్తే అత్యాచారం చేయండి
  • సాధ్యమైనంత నగ్నంగా కనిపించాలనే పొట్టి దుస్తులు
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువతి

పొట్టి దుస్తులు ధరించే అమ్మాయిలపై ఓ ఢిల్లీ మహిళ చేసిన వ్యాఖ్యలు, ఆపై చుట్టుపక్కల ఉన్న యువతులు ఆమెను నిలదీయడానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతా తమను చూడాలన్న కోరికతోనే అమ్మాయిలు షార్ట్స్ వేసుకుని రోడ్లపైకి వస్తున్నారని, అత్యాచారం చేయించుకునేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని, సాధ్యమైనంత ఎక్కువ నగ్నంగా కనిపించడమే వీరి ఉద్దేశమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆమె మాటలను సీరియస్ గా తీసుకున్న ఓ యువతి, మొత్తం ఘటనను వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకోగా, ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

 తాను, తన స్నేహితులు ఓ రెస్టారెంట్ లో ఉండగా, సదరు మహిళ తమ వద్దకు వచ్చి వాదనకు దిగిందని, షార్ట్స్ వేసుకున్నందుకు సిగ్గుపడాలని ఆమె అనడంతో, తాము వాదనకు దిగామని సదరు యువతి తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది. ఇలాంటి దుస్తులు వేసుకున్న వారిని అవకాశం లభించినప్పుడెల్లా రేప్ చేయాలని రెస్టారెంట్ లోని పురుషులకు ఆమె చెప్పగా, వారంతా చప్పట్లు కొట్టారని, దీంతో ఆమె వికృత మనస్తత్వాన్ని తాము ప్రశ్నిస్తూ వీడియో తీశామని వెల్లడించింది. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనని తాము డిమాండ్ చేసినా పట్టించుకోలేదని తెలిపింది. దాదాపు పది నిమిషాల నిడివివున్న ఈ వీడియోను తీసిన అమ్మాయి ఎవరన్నది మాత్రం తెలియరాలేదు.

Delhi Women
Shorts
Rape
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News