Shamshabad: పగిలిన విమానం ముందు అద్దం... శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

  • 155 మందితో బయలుదేరిన విమానం
  • తప్పిన పెను ప్రమాదం
  • మరో విమానంలో ప్రయాణికుల తరలింపు

ముంబై నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ విమానం ఫ్రంట్ మిర్రర్ పగిలిపోవడంతో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. మొత్తం 155 మంది ప్రయాణికులతో ముంబై నుంచి విమానం బయలుదేరగా, మార్గమధ్యంలో ముందున్న అద్దం పగిలింది. ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పైలట్లు, శంషాబాద్ ఏటీసీకి సమాచారం ఇచ్చి, అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరారు. వెంటనే అధికారులు స్పందించడంతో, 155 మంది ప్రాణాలు మిగిలాయి. విమానం ల్యాండ్ అయిన తరువాత, వారిని మరో ఫ్లయిట్ లో బెంగళూరుకు చేర్చే ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

Shamshabad
Emergency Landing
Front Mirror
  • Loading...

More Telugu News