Chhattisgarh: కరుడుగట్టిన మహిళా మావోయిస్టు మంగ్లీ అరెస్ట్
- మంగ్లీపై ఐదు లక్షల రివార్డు
- 2011 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో..
- మంగ్లీపై పది కేసులు
కరుడుగట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్ మంగ్లీని చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కన్‌గిరి మావోయిస్టు సభ్యురాలైన మంగ్లీపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్టు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. 2011 నుంచి మావోయిస్టుల్లో పనిచేస్తున్న మంగ్లీ.. భద్రతా దళాలు, గ్రామస్థులపై దాడిచేసిన కేసులో నిందితురాలని ఎస్పీ పేర్కొన్నారు. మంగ్లీపై పది కేసులున్నట్టు చెప్పారు. మలివాడలో మందుపాతర పేల్చివేత, 2016లో సీఆర్‌పీఎఫ్ బలగాలను చంపిన కేసు, చోలనర్‌లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను చంపిన కేసులో మంగ్లీ నిందితురాలని పేర్కొన్నారు.