mamata banerjee: 40 మంది టచ్‌లో ఉన్నారా?.. దమ్ముంటే ఒక్కరిని వెంట తీసుకెళ్లండి!: మోదీకి మమత సవాల్

  • మీ మాటలు సిగ్గుచేటు
  • ప్రధానిగా ఉండే హక్కు కోల్పోయారు
  • ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంప్రదాయం మాది కాదు

తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల మోదీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని, దీదీని వదిలిపెట్టడం ఖాయమని పేర్కొన్నారు. తమతో ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అన్నారు.

మోదీ వ్యాఖ్యలపై మమత నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లాలంటూ సవాలు విసిరారు. బీజేపీలా తమకు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంప్రదాయం లేదన్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతున్న మోదీ లోక్‌సభ నామినేషన్‌ను వెంటనే రద్దు చేయాలంటూ ఈసీకి తమ పార్టీ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మోదీ వ్యాఖ్యలు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. మోదీ ప్రధానిగా, మాజీ ప్రధానిగా ఉండే హక్కు కోల్పోయారని మమత నిప్పులు చెరిగారు.

mamata banerjee
Narendra Modi
West Bengal
TMC
  • Loading...

More Telugu News