AIADMK: ఈ ఎన్నికల్లో ఓడితే పన్నీర్ సెల్వం చేరేది బీజేపీలోనే: ఏఎంఎంకే

  • అన్నాడీఎంకే ఒక్క నియోజకవర్గంలోనూ గెలవదు
  • లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎంఎంకే ఘన విజయం ఖాయం
  • అన్నాడీఎంకేలో ఓటమి భయం

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై ఏఎంఎంకే ప్రచార కార్యదర్శి తంగతమిళ్‌సెల్వన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిన మరుక్షణం పన్నీర్ సెల్వం కుటుంబ సభ్యులతో కలిసి బీజేపీలో చేరుతారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే ఒక్క నియోజకవర్గంలోనూ గెలవబోదన్నారు. వారి మెగా కూటమి ప్రజావ్యతిరేక కూటమని విమర్శించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎంఎంకే ఘన విజయం సాధిస్తుందని తంగతమిళ్‌సెల్వన్‌ ధీమా వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందన్న తంగతమిళ్‌సెల్వన్‌.. అందుకే వారు కోపంతో మాట్లాడుతున్నారని అన్నారు. పన్నీర్ సెల్వం విలేకరులతో కోపంగా మాట్లాడడాన్ని గుర్తు చేసిన ఆయన అది సరికాదన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే నేతలు.. ముగ్గురు ఎమ్మెల్యేల విషయమై సభాపతిని కలిశారని ఆరోపించారు. అన్నాడీఎంకేలో ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల తర్వాత పన్నీర్ సెల్వం కుటుంబం బీజేపీలో చేరడం ఖాయమని సెల్వన్ ఆరోపించారు.

AIADMK
panneerselvam
palanisamy
Tamil Nadu
AMMK
  • Loading...

More Telugu News