spy reddy: ఎస్పీవై రెడ్డి మృతికి చంద్రబాబు, పవన్ ప్రగాఢ సంతాపం

  • నంది గ్రూపుతో ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్పనేత
  • ఆయన మృతి నంద్యాలకు తీరని లోటు: బాబు
  • రాజకీయాల్లో హుందాతనానికి నిదర్శనం: పవన్

నంద్యాల ఎంపీ, జనసేన నేత ఎస్పీవై రెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. నంది గ్రూపు సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్ప మనిషి ఎస్పీవై అని కొనియాడారు. ఆయన మృతి కర్నూలు జిల్లాకు, నంద్యాల ప్రాంతానికి తీరని లోటన్నారు. ఎంపీగా ఆయన విశేష సేవలు ప్రశంసనీయమన్నారు.

ఎస్పీవై రెడ్డి మృతి వార్త తెలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం పాటించిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. రాజకీయాల్లో ఆయన అనుభవం, సేవాగుణం పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయనే జనసేనలోకి ఆయనను ఆహ్వానించినట్టు చెప్పారు.

spy reddy
Kurnool District
nandyal
Chandrababu
Pawan Kalyan
  • Loading...

More Telugu News