spy reddy: నంద్యాల ఎంపీ, జనసేన నేత ఎస్పీవై రెడ్డి కన్నుమూత

  • ఎన్నికల ప్రచారంలో వడదెబ్బకు గురైన ఎస్పీవై
  • 26 రోజులుగా బంజారాహిల్స్ కేర్‌లో చికిత్స
  • మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎంపీ, జనసేన నేత ఎస్పీవై రెడ్డి (69) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన విశేష సేవలు అందించారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు.

గత నెలలో జనసేన చీఫ్ పవన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎస్పీవై రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏప్రిల్ 3న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో మృతి చెందారు.  

spy reddy
nandyal
Kurnool District
janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News