Phani Cyclone: తీవ్ర నుంచి అతి తీవ్ర తుపానుగా ఫణి.. ఆ రెండు జిల్లాలవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- వేగంగా కదులుతున్న ఫణి తుపాను
- ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వైపు పయనం
- తీర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచన
ఫణి తుపాను చాలా వేగంగా కదులుతోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ తెలిపారు. ప్రస్తుతం తీవ్ర తుపాను నుంచి అతి తీవ్ర తుపానుగా మారుతోందని రమేష్ తెలిపారు. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఫణి ఒడిశా తీరం నుంచి పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తోందని రమేష్ తెలిపారు. బీచ్, కోస్తా తీర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రమేష్ తెలిపారు.