Social Media: సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసిన శ్రీలంక

  • ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాపై నిషేధం విధించిన శ్రీలంక
  • సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని సూచన
  • శ్రీలంకలో ఇంకా సాధారణ స్థాయికి రాని పరిస్థితులు

ఉగ్రదాడుల నేపథ్యంలో సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం ఎత్తి వేసింది. వరుస పేలుళ్ల అనంతరం, భయాందోళనలను పెంచే సమాచారం వేగంగా విస్తరించకుండా ఉంచడం కోసం, మత కల్లోలాలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం ఈ నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం విధించింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర అన్నింటినీ బ్యాన్ చేసింది.

సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భంగా ప్రజలను ప్రభుత్వం కోరింది. దేశంలో పరిస్థితి ఇంకా సాధారణ స్థాయికి రాలేదని, అందువల్ల సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో 250 మంది చనిపోయారు. దాదాపు 500 మంది క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News