Supreme Court: రాఫెల్ రివ్యూ పిటిషన్లపై నాలుగు వారాల సమయం అడిగిన కేంద్రం, కుదరదన్న సుప్రీం కోర్టు
- మే4లోగా సమాధానం చెప్పాలి
- కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
- తదుపరి విచారణ మే6కి వాయిదా
దేశాన్ని కుదిపేసిన రాఫెల్ స్కాంపై విచారణలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని పరుగులు పెట్టిస్తోంది. రాఫెల్ ఒప్పందంపై గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై మంగళవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఆ రివ్యూ పిటిషన్లపై బదులిచ్చేందుకు తమకు నాలుగు వారాల సమయం అవసరం అంటూ కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు విన్నవించారు. అయితే, సుప్రీం ఆయన వాదనలను అంగీకరించలేదు. మే4లోగా తమకు జవాబు చెప్పాలంటూ ఆదేశాలు జారీచేసింది. రాఫెల్ స్కాంపై తదుపరి విచారణ మే6కి వాయిదా వేసింది.