rgv: రామ్ గోపాల్ వర్మ ఒక సైకో డైరెక్టర్: యామిని సాధినేని

  • వర్మలాంటి సైకోకు జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్న యామిని
  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని రేపు విడుదల చేస్తున్నామని ప్రకటించిన యూనిట్
  • వర్మ ప్రెస్ మీట్ ను అడ్డుకున్న విజయవాడ పోలీసులు

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ ఒక సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. వర్మలాంటి సైకోకు వైసీపీ అధినేత జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ యత్నించగా... పోలీసులు అడ్డుకుని, బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించి, పంపించేశారు. ఈ సందర్భంగా వర్మకు మద్దతుగా జగన్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే, యామిని పైవ్యాఖ్యలు చేశారు.

rgv
varma
yamini sadhineni
Telugudesam
jagan
ysrcp
lakshmis ntr
  • Loading...

More Telugu News