yash: ఏడు సినిమాలు వదులుకున్న హీరోయిన్

  • 'కేజీఎఫ్' తో నా కెరియర్ మారిపోయింది
  •  దక్షిణాది భాషల నుంచి వరుస అవకాశాలు
  • 'కేజీఎఫ్ 2' నాకు చాలా ముఖ్యం 

క్రితం ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ మూవీ 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో హీరోగా చేసిన 'యశ్' క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక కథానాయికగా చేసిన శ్రీనిధి శెట్టి క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస అవకాశాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఏడు సినిమాలను వదులుకోవలసి వచ్చింది.

ఆ విషయాన్ని గురించి ఆమె ప్రస్తావిస్తూ .. 'కేజీఎఫ్ చాఫ్టర్ 1' హిట్ అయిన తరువాత నా కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. కన్నడ నుంచి 3 .. తెలుగు నుంచి 2 .. తమిళం నుంచి 2 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే 'కేజీఎఫ్ చాఫ్టర్ 2'కోసం జూన్ నుంచి అక్టోబర్ వరకూ డేట్స్ ఇచ్చాను. ఆ మధ్యలోనే నా డేట్స్ కావాలని ఈ ఏడు సినిమాలవారు అడిగారు. నాకు 'కేజీఎఫ్ చాఫ్టర్ 2' చాలా ముఖ్యం .. అందుకే మిగతా సినిమాలను వదులుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News