sidhu: ఆయనకు మీరు వేసే ఓటు మీ పిల్లలను చాయ్ వాలాగా మార్చేస్తుంది: సిద్ధూ

  • అంతా జరిగిపోయిన తర్వాత బాధపడవద్దు
  • ఓటు వేసే ముందు ఆలోచించుకోండి
  • మోదీపై మరోసారి విమర్శలు గుప్పించిన సిద్ధూ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ సిద్ధూ మరోసారి ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి పొరపాటున మీరు వేసే ఓటు మీ పిల్లలను చాయ్ వాలా లేదా పకోడీవాలా లేదా కాపలాదారుడిగా మార్చేస్తుందని ఆయన అన్నారు. ఓటు వేసేముందు అన్నీ ఆలోచించుకోవాలని సూచించారు. అంతా జరిగిపోయిన తర్వాత బాధపడటం, జరిగిన తప్పును సరిదిద్దుకోవడం కంటే తప్పు చేయకపోవడమే మేలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాచరిక పాలన కొనసాగుతుందని, వారు సామాన్యులకు అందుబాటులో ఉండరని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, సిద్ధూ ఈ మేరకు స్పందించారు.

sidhu
modi
chaiwala
congress
bjp
  • Loading...

More Telugu News