Hazipur: హాజీపూర్ లో తీవ్ర ఉద్రిక్తత... సైకో శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్తులు!

  • గ్రామ ప్రజల కళ్లముందే తిరిగిన మానవ మృగం
  • ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు
  • కట్టలు తెంచుకున్న ప్రజల ఆగ్రహం

 తమ కళ్లముందే తిరుగుతున్న ఓ మానవ మృగం తమ ఊరి ఆడ బిడ్డలను అత్యంత కిరాతకంగా హత్యలు చేసిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని హాజీపూర్ ప్రజలు, సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రాచకొండ పోలీసుల అదుపులో ఉండగా, అతని కుటుంబీకులు గత రాత్రి ఊరు వదిలి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోగా, అంతా కలిసి వారి ఇంటి వద్దకు వచ్చి, తాళం వేసివున్న ఇంటికి నిప్పంటించారు. పోలీసులు సైతం గ్రామ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. గ్రామంలో పరిస్థితి మరింత అదుపు తప్పకుండా అదనపు బలగాలను రప్పించారు.

Hazipur
House
Fire
Srinivasreddy
  • Loading...

More Telugu News