Visakhapatnam District: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో విశాఖ సీఐ వెకిలి చేష్టలు.. వేటేసిన సీపీ

  • మీ అక్కకంటే నువ్వే అందంగా ఉంటావు
  • ఎప్పుడూ ఆమె కుటుంబం గురించేనా? నీ గురించి కూడా ఆలోచించు
  • నిన్ను ప్రేమించాలని ఉంది.. అంటూ సీఐ అసభ్య ప్రవర్తన

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన విశాఖపట్టణం సీఐ సన్యాసినాయుడిపై వేటు పడింది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతితో అసభ్యంగా మాట్లాడిన సీఐ ‘‘నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు. మీ అక్క కంటే నువ్వే బాగున్నావు. ఒకసారి బీచ్‌కు వస్తే మాట్లాడుకుందాం. నిన్ను ప్రేమించాలని ఉంది. ఎంతసేపూ మీ అక్క కుటుంబమేనా? నీ గురించి ఆలోచించవా?’’ అంటూ వేధించడం మొదలుపెట్టాడు. సీఐ మాటలను రికార్డు చేసిన మహిళ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా దృష్టికి తీసుకెళ్లడంతో సీఐని ఆయన సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా జిమ్మయ్యవలస మండలంలోని లక్ష్మీపురానికి చెందిన పల్లా కృష్ణ కుమారి ఏయూలో పీహెచ్‌డీ చేస్తూ ఎంవీపీ కాలనీలో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన మేనమామ విజయభాస్కర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి పేరుతో మోసం చేసిన మేనమామపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ఈ నెల 27న తన సోదరితో కలిసి వెళ్లింది. కృష్ణ కుమారి సోదరిని చూసిన సీఐ సన్యాసినాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె  సీపీ మహేశ్ చంద్ర లడ్డాకు ఫిర్యాదు చేసింది. సీఐ తనతో మాట్లాడిన కాల్ రికార్డును వినిపించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ దర్యాప్తునకు ఆదేశించారు. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Visakhapatnam District
CI Sanyasinaidu
CP Mahesh chandra ladda
Andhra Pradesh
  • Loading...

More Telugu News