Sujana Chowdary: విచారణకు రమ్మంటూ.. సుజనాచౌదరికి సీబీఐ మరోసారి నోటీసులు

  • ఏప్రిల్ 26న విచారణకు రావాలంటూ గతంలో నోటీసులు
  • హాజరుకాని సుజనా
  • తాజా నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ ఎంపీ

ఎన్నికల సందర్భంగా తమపై కేంద్రం కక్ష సాధింపు ధోరణి చూపిస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సుజనాచౌదరికి సీబీఐ మరోసారి నోటీసులు పంపడం తీవ్ర కలకలం రేపింది. అంతకుముందు ఏప్రిల్ 26న బెంగళూరు సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు. ఆ విచారణకు సుజనా వెళ్లకపోవడంతో తాజాగా నోటీసులు పంపినట్టు అర్థమవుతోంది.

మే4న విచారణకు రావాలంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే సీబీఐ నోటీసులపై సుజనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు సంబంధం లేని విషయాలను ఆపాదిస్తూ అప్రదిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Sujana Chowdary
  • Loading...

More Telugu News