TRS: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రయత్నాలపై హైకోర్టును ఆశ్రయించిన ఉత్తమ్, భట్టి

  • విలీన ఉత్తర్వులివ్వకుండా ఆదేశాలివ్వాలి
  • విలీనానికి ముందు తమకు నోటీసులివ్వాలి
  • మద్దతు ప్రకటించిన 11 మంది ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ శాసనసనభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలనే ప్రయత్నాలపై హైకోర్టులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పిటిషన్ దాఖలు చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు సభాపతి ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో నేతలు పేర్కొన్నారు. విలీనం చేసే ముందు తమకు నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు.

కాంగ్రెస్ నేతల పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. వీరంతా కలిసి సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని స్పీకర్‌ను కోరుతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ తేల్చిన తరువాతే విలీనం తీసుకునేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ నేతలు పిటిషన్‌లో కోరారు.

TRS
Congress
Uttam Kumar Reddy
Mallu Bhatti Vikramarka
High Court
Speaker
  • Loading...

More Telugu News