Narendra Modi: మమత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మోదీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-ebb751dd561fcf3667cae80cb688f572c1104581.jpg)
- మట్టితో రసగుల్లాను చేసి పంపిస్తామన్న మమత
- బెంగాల్ మట్టిలో మహనీయుల సుగంధం ఉంది
- ఆ రసగుల్లాయే నాకు మహా ప్రసాదం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన కామెంట్‌కి ప్రధాని నరేంద్ర మోదీ నేడు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మమత మాట్లాడుతూ, మోదీ పళ్లు విరిగేలా, పశ్చిమ బెంగాల్ మట్టి గులకరాళ్లతో చేసిన రసగుల్లాను చేసి పంపిస్తామని వ్యాఖ్యానించారు.
నేడు శ్రీరాంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. బెంగాల్ మట్టిలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జేసీ బోస్ వంటి మహనీయుల సుగంధం నిండి ఉందని, అలాంటి పవిత్రమైన మట్టితో రసగుల్లా చేసి పంపితే అదే తనకు మహా ప్రసాదమని అంటూ మోదీ ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టారు.