vinod: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలను గెలవబోతోంది
  • కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పుతారు
  • రాజకీయ విలువలను బీజేపీ, కాంగ్రెస్ దిగజార్చాయి

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ జోస్యం చెప్పారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలవబోతోందని ఆయన అన్నారు. కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారని అన్నారు. రాజకీయ విలువలను బీజేపీ, కాంగ్రెస్ లు దిగజార్చాయని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

vinod
TRS
kcr
  • Loading...

More Telugu News