mohammed shami: క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య అరెస్ట్

  • ఉత్తరప్రదేశ్ లోని షమీ నివాసానికి వెళ్లిన హసీన్
  • కుటుంబసభ్యులతో గొడవ
  • అరెస్ట్ అనంతరం బెయిల్ పై విడుదల

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మోహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అమోహాలో ఉన్న షమీ నివాసానికి వెళ్లిన ఆమె... అతని బంధువులతో గొడవపడ్డారు. దీంతో, రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై ఆమె విడుదలయ్యారు.

సాహస్ పూర్ అలీ నగర్ గ్రామంలోని షమీ నివాసానికి వెళ్లిన జహాన్ ను బయటకు వెళ్లాలని కుటుంబసభ్యులు కోరారు. అయితే, తన బిడ్డతో కలసి గదిలోకి వెళ్లి ఆమె తలుపు వేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే, ఇరుపక్షాల మధ్య గొడవను ఆపడం సాధ్యంకాకపోవడంతో, చివరకు ఆమెను కస్టడీకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా హసీన్ మాట్లాడుతూ, 'నేను నా భర్త ఇంటికి వచ్చా. ఇక్కడ ఉండే హక్కు నాకుంది. షమీ కుటుంబసభ్యులు నాతో తప్పుగా వ్యవహరిస్తున్నారు. అయినా పోలీసులు వాళ్లకే సహకరిస్తున్నారు. వాళ్లను అరెస్ట్ చేయాల్సింది పోయి... నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు' అని మండిపడ్డారు. షమీకి, అతని భార్యకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. షమీపై ఆమె కేసు కూడా పెట్టారు.

mohammed shami
wife
hasin jahan
arrest
  • Loading...

More Telugu News