mamata banerjee: దీదీ... 40 మంది మీ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు: బాంబు పేల్చిన మోదీ

  • మే 23న అన్ని చోట్ల కమలం వికసించబోతోంది
  • మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని విడిచి పారిపోతారు
  • రాజకీయంగా మీ మనుగడ కష్టం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్ లో ఉన్నారని... ఎన్నికలు ముగిసిన తర్వాత వారంతా ఆమెను విడిచిపెడతారని అన్నారు. కోల్ కతాకు సమీపంలో ఉన్న సేరంపోర్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'దీదీ... ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23న అన్ని చోట్ల కమలం వికసించబోతోంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని విడిచి, పారిపోతారు. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు' అని చెప్పారు. మమతా బెనర్జీ రాజకీయంగా మనుగడ సాగించడం సాధ్యం కాదని... ఎందుకంటే ఆమె ప్రజలను మోసం చేశారని అన్నారు.

mamata banerjee
modi
bjp
tmc
  • Loading...

More Telugu News