Andhra Pradesh: చంద్రబాబు, కేసీఆర్ లు ఈవెంట్ మేనేజ్ మెంట్ కు అలవాటు పడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ

  • విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోంది
  • ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
  • లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షలో ఏపీ బీజేపీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇద్దరూ ఈవెంట్ మేనేజ్ మెంట్ కు అలవాటు పడ్డారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికి న్యాయం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించిన కన్నా, మీడియాతో మాట్లాడారు.

ఇంటర్ బోర్డు అవకతవకలపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలను నిర్వహించలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల విషయంలో జరిగినట్లు దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ఇంటర్ విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

Andhra Pradesh
Telangana
Chandrababu
KCR
BJP
kanna
Hyderabad
  • Loading...

More Telugu News