kcr: ఇంత జరుగుతున్నా... ఫాంహౌస్ దాటి బయటకు రావడం లేదు: కేసీఆర్ పై పొన్నాల ఫైర్

  • బాధ్యతగా వ్యవహరించి ఉంటే 23 మంది విద్యార్థుల ప్రాణాలు ఎలా పోతాయి?
  • న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది
  • మన ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది?

ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే 23 మంది ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు ఎలా పోతాయని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో 10 లక్షల విద్యార్థుల కుటుంబాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా కూడా ఇవ్వలేని రాక్షస పాలన రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదని మండిపడ్డారు.

ప్రతిపక్ష నేతలను నిర్బంధించడానికి పోలీసులను వాడటం దుర్మార్గమని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మన కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు.

kcr
ponnala
inter
congress
TRS
  • Loading...

More Telugu News