central inteligence: భారత్‌లో మరిన్ని ‘పుల్వామా’ తరహా దాడులకు జైషే, ఐఎస్ కుట్ర: నిఘా సంస్థల హెచ్చరిక
- ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక
- ఈ సంస్థలతో పాకిస్థాన్ ఐఎస్ఐ టచ్‌లో ఉంది
- ఇప్పటికే దాడుల కోసం ఈ సంస్థలు రహస్యంగా సమావేశమయ్యాయి
జైషేమహ్మద్, ఐఎస్ సంస్థలను ఒక్కటిగా చేసి భారత్‌పై మరిన్ని ‘పుల్వామా’ తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని భారత్‌లోని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇందుకోసం ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ప్రతినిధులతో ఐఎస్ఐ సంయుక్త సమావేశం జరిగేలా చూసిందని తెలిపింది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐతో నిత్యం టచ్‌లో ఉంటున్నాయని కేంద్రహోం శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు బాలాకోట్ వైమానిక దాడులతో భంగపడ్డ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరోసారి చురుకుగా మారినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్‌లో పుల్వామా తరహా మెరుపు దాడులు నిర్వహించేందుకు సుశిక్షితులైన ఉగ్రవాదులనే ఎంచుకోవాలని జైషే టాప్ కమాండర్లకు మసూద్ ఇప్పటికే సమాచారం పంపాడని ఈ నివేదికలో నిఘా వర్గాలు పేర్కొన్నాయి.