Andhra Pradesh: కుటుంబ కలహాలతో మనస్తాపం.. పురుగుల మందు తాగిన పోలీస్ కానిస్టేబుల్!

  • ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరిలో ఘటన
  • ఇంట్లో తరచూ గొడవలతో రవికుమార్ మనోవేదన
  • ఏలూరు ప్రభుత్వాసుపత్రితో కొనసాగుతున్న చికిత్స

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరిలోని ఏలూరులో రవి కుమార్ అనే యువకుడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇక్కడి జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో రవికుమార్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల రవికుమార్ ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో కొద్దిరోజులుగా స్నేహితులు, ఉద్యోగులతో కూడా అతను ముభావంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈరోజు మరోసారి ఇంట్లో కుటుంబ సభ్యులతో రవికుమార్ కు వాగ్వాదం జరిగింది.

దీంతో సహనం కోల్పోయిన రవికుమార్ పొలానికి కొట్టేందుకు తెచ్చిన పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయన్ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉందనీ, మరో 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు.

Andhra Pradesh
West Godavari District
Police
constable
suicide
  • Loading...

More Telugu News