Telangana: తెలంగాణలో విపక్షాలపై పోలీసుల ఉక్కుపాదం.. పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతల అరెస్ట్!

  • ఇంటర్ అవకతవకలపై ప్రతిపక్షాల ఆందోళన
  • కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ హౌస్ అరెస్ట్
  • వామపక్ష విద్యార్థి నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

ఇంటర్ పరీక్షల ఫలితాల గోల్ మాల్ పై విపక్షాలు ఈరోజు చలో ఇంటర్ బోర్డు కార్యక్రమాన్ని చేపట్టాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణను అరెస్ట్ చేసిన పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీజేఎస్ అధినేత కోదండరాంను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకుని నారాయణగూడ పీఎస్ కు తరలించారు. మరోవైపు ఇంటర్ బోర్డును ముట్టడించిన వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు, సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాల నేపథ్యంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

Telangana
Congress
Telugudesam
Police
arrest
  • Loading...

More Telugu News