Narendra Modi: 'ఫణి' గురించి విన్నాను... అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా: నరేంద్ర మోదీ

  • ప్రజలకు అవసరమైన సహాయాన్ని సిద్ధం చేయండి
  • రాష్ట్రాల ప్రభుత్వాలతో కలసి పనిచేయాలి
  • అధికారులకు నరేంద్ర మోదీ ఆదేశం

దక్షిణాదిపై కన్నేసిన 'ఫణి' తుపాను గురించి తాను విన్నానని, అధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరానని అన్నారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలతో కలసి పనిచేయాలని ఆదేశించానని అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కాగా, 'ఫణి' తుపానుపై ఓ స్పష్టమైన అంచనా రావాలంటే, ఇంకో 36 నుంచి 48 గంటల సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.



Narendra Modi
Twitter
Fani
Cyclone
  • Loading...

More Telugu News