Mahesh Babu: మహేశ్ బాబుకు హాలీవుడ్ నటుడి నుంచి ఆహ్వానం

  • లంచ్ కు పిలిచిన 'ప్రిడేటర్' నటుడు బిల్ డ్యూక్
  • లాస్ ఏంజెల్స్ కు వస్తే కలవాలంటూ ట్వీట్
  • స్పై మూవీ తీద్దామంటూ ఆఫర్

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది. హాలీవుడ్ లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా పేర్కొనే ప్రిడేటర్, ఎక్స్ మెన్ చిత్రాల్లో నటించిన బిల్ డ్యూక్ తాజాగా మహేశ్ బాబును లంచ్ కు ఆహ్వానించారు. మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి, ఏఆర్ మురగదాస్ లను ఉద్దేశించి ట్వీట్ చేసిన బిల్ డ్యూక్, లాస్ ఏంజెల్స్ వస్తే తనను కలవాలని సూచించారు. వీలైతే ఓ ఇంటర్నేషనల్ స్పై మూవీ తీద్దామంటూ ఆఫర్ చేశారు. "లాస్ ఏంజెల్స్ వస్తే డౌన్ టౌన్ లో కలుద్దాం, డిన్నర్ చేస్తూ స్పై మూవీ గురించి చర్చిద్దాం" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ బిల్ డ్యూక్ అభిమానుల కంటే మహేశ్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Mahesh Babu
Hollywood
  • Loading...

More Telugu News