Sindhu Sharma: సింధూ శర్మ పోరాటం ఫలించింది.. తల్లి ఒడికి చేరిన చిన్న కూతురు

  • అన్ని విషయాలూ నా పెద్ద కుమార్తెకు తెలుసు
  • చూసేందుకు కూడా నిరాకరిస్తున్నారు
  • అన్ని విషయాలు బయటపెడుతుందని భయపడుతున్నారు

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూశర్మ చేసిన పోరాటం కొంత వరకూ ఫలించింది. రామ్మోహన్‌రావు కుటుంబం, చిన్న కూతురును సింధు శర్మకు అప్పగించింది. తనకు పెద్ద కుమార్తెను కూడా అప్పగించాలని సింధు డిమాండ్ చేస్తోంది. అయితే దీనికి రామ్మోహన్‌రావు కుటుంబం నిరాకరిస్తోంది.

అయితే తన పెద్ద కుమార్తె‌కు తనపై దాడికి సంబంధించిన అన్ని విషయాలూ తెలుసని సింధు చెబుతోంది. పెద్ద పాపను చూడటానికి కూడా ఆ కుటుంబం నిరాకరిస్తోందని, అన్ని విషయాలు బయట పెడుతుందనే భయంతోనే పాపను తనకు అప్పగించట్లేదని సింధు ఆరోపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితి ఏ తల్లికీ రాకూడదని, పెద్దపాపను అప్పగించకుంటే కోర్టుకు వెళతానని సింధు స్పష్టం చేసింది.

Sindhu Sharma
Rammohan Rao
Retired Judge
Elder Daughter
  • Loading...

More Telugu News