Bandla Ganesh: మొదట్లో నన్ను సూపర్ స్టార్, మెగాస్టార్ అన్నారు.. రాజకీయాల్లోకి వచ్చాకనే నాకు అసలు విషయం అర్థమైంది: బండ్ల గణేష్

  • రాజకీయాలకు పనికిరానని అప్పుడే తెలిసింది
  • బయటకు వస్తే బాగుండదని పార్టీలోనే ఉన్నా
  • రాహుల్‌ని ప్రధానిగా చూడాలి

రాజకీయాల్లోకి రాకముందు కొందరు తనను సూపర్ స్టార్, మెగాస్టార్ అన్నారని, అయితే రాజకీయాల్లోకి వచ్చాకనే అసలు విషయం అర్థమైందని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌‌ పేర్కొన్నారు. ఇటీవల రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను రాజకీయాలకు పనికి రానని ఎన్నికలకు ముందే తేలిందని కానీ, బయటకు వచ్చేస్తే బాగుండదని పార్టీలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.

రాజకీయాల్లో యాక్టింగ్ పనికిరాదని అర్థమైందన్న బండ్ల గణేష్ తనకు రెండు కోరికలున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది ఒక కోరిక అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది రెండో కోరికగా గణేష్ తెలిపారు. తనను కొందరు సూపర్ స్టార్, మెగాస్టార్ అన్నారని, రాజకీయాల్లోకి వచ్చాకనే తనే స్టార్ కాదనే విషయం అర్థమైందన్నారు.  

Bandla Ganesh
Pawan Kalyan
Rahul Gandhi
Megastar
Super Star
Politics
  • Loading...

More Telugu News